AP NEWS: తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు 3:30 కి విచారణ చేపట్టిన న్యాయస్థానం… తరువాత మరొక కీలక నిర్ణయం తీసుకుంది.
Petrol Prices:పశ్చిమాసియా లో దాడుల కారణంగా … భారత్ లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాసాలున్నాయా?
తిరుమల శ్రీవారి లడ్డు వివాదం పై విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 విచారణ జరిపిన న్యాయస్థానం ముందు గా లడ్డు వివాదం పై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను కొనసాగించాలా లేక మరొక స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించాల అనే అంశంపై సొలిసిటర్ జనరల్ మెహతా అభిప్రాయం అడిగింది. అయితే తన అభిప్రయాన్ని వెల్లడించడానికి కొంత సమయం కావాలని మెహతా కోరారు.
కాగా, అక్టోబర్ 4 ఉదయం 10:30 కు తిరిగి విచారణ జరుగుతుందని సుప్రీం కోర్టు తెలిపింది.
అయితే, ఇప్పుడు మెహతా ఎంచెబుతాడే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మెహతా సిట్ (SIT) దర్యాప్తు బృందం సరిపోతుందని అంటే… సిట్ (sit) తోనే విచారణ జరుపుతారు. ఒకవేళ సీబీఐ లాంటి దర్యాఫ్తు సంస్థ తో విచారణ జరిపించడం అవసరమైతే , సుప్రీం కోర్టు దానిపై నిర్ణయాన్ని తీసుకుంటుంది.
ఐతే, ఏపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ సిట్ దర్యాప్తు బృందం ను వ్యరేకిస్తుంది. ఎందుకంటే సిట్ ను అధికార ప్రభుత్వం విచారణ పై వేసింది. కాబట్టి నిజాలు బయటకు రావని చెప్పింది.
మొత్తానికి లడ్డు వివాదాన్ని ఏ సంస్థ దర్యాప్తు చేస్తుందనే విషయం తెలియాల్సియంది. ఈ విషయంపై రేపు ఒక క్లారిటీ వస్తుంది.